Rains: ఏపీలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం

  • ఏపీలో బెంబేలెత్తిస్తున్న ఎండలు
  • మరోవైపు వడగాడ్పులతో అల్లాడిపోతున్న ప్రజలు
  • ఛత్తీస్ గఢ్ నుంచి కేరళ వరకు ద్రోణి
  • ఝార్ఖండ్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు మరో ద్రోణి 
Rain alert for AP

అధిక పగటి ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులతో బేజారెత్తిపోతున్న ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్ గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని తెలిపింది. అదే సమయంలో ఝార్ఖండ్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. 

ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

ప్రస్తుతం ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. ఏప్రిల్ మాసంలో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

More Telugu News