Observers: కర్ణాటక ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురి నియామకం

AICC appoints observers for assembly elections in Karnataka
  • మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
  • హోరాహోరీకి సిద్ధమైన ప్రధాన పార్టీలు
  • పరిశీలకుల నియామకం చేపట్టిన కాంగ్రెస్
  • బెంగళూరు పరిశీలకుడిగా రఘువీరారెడ్డి
  • పరిశీలకులుగా సీతక్క, మల్లు రవి, జేడీ శీలం,శైలజానాథ్, సంపత్ బెల్లయ్య నాయక్ 
కర్ణాటకలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకుల నియామకం చేపట్టింది. ఏఐసీసీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురిని నియమించింది. 

బెంగళూరు పరిశీలకుడిగా రఘువీరారెడ్డి, రాష్ట్రంలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా శైలజానాథ్, బెల్లయ్య నాయక్, సీతక్క, సంపత్ కుమార్, జేడీ శీలం, మల్లు రవిలను నియమించింది. కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Observers
Congress
Assembly Elections
Karnataka

More Telugu News