Bandi Sanjay: బీఆర్ఎస్, వైసీపీ... ఒకే నాణేనికి బొమ్మా బొరుసు వంటివి: బండి సంజయ్

Bandi Sanjay slams BRS and YSRCP over Vizag Steel Plant
  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్, వైసీపీ మధ్య పరస్పర విమర్శలు
  • ఒకరి స్వార్థానికి ఒకరు వ్యవహరిస్తున్నారన్న బండి సంజయ్
  • స్వార్థం కోసం విద్వేషాలు రగుల్చుతున్నారని ఆగ్రహం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్, వైసీపీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసు వంటివని విమర్శించారు. ఒకరి స్వార్థం కోసం ఒకరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, వైసీపీ... రెండు చోట్లా సెంటిమెంట్ రగుల్చుతున్నాయని, స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనే డబ్బు ఉంటే బయ్యారం ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా, నిజాం షుగర్స్ పరిశ్రమ తెరవొచ్చు కదా? అని బండి సంజయ్ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News