Punjab: పంజాబ్‌ మిలటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం

4 Dead In Firing At Punjab Military Station Search Ops On
  • సివిల్ డ్రెస్ లో వచ్చిన ఇద్దరి కాల్పుల్లో నలుగురి మృతి
  • ఈ ఉదయం తెల్లవారుజామున ఘటన
  • ఉగ్రదాడి కాదని చెబుతున్న అధికారులు
పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో దాడి జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయితే ఇది ఉగ్రదాడి కాదని అధికారులు చెబుతున్నారు. ఘటనపై విచారణ చేపట్టినట్టు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘భటిండా మిలిటరీ స్టేషన్‌లో తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగి, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాల్పుల్లో నలుగురు మృతి చెందారు’ అని ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది.

ఆర్మీ అధికారుల మెస్‌లోనే కాల్పులు జరిగినట్లు సమాచారం. మృతి చెందిన నలుగురు 80 మీడియం రెజిమెంట్ కు చెందిన వారని అధికారులు చెబుతున్నారు. సివిల్ డ్రెస్సుల్లో లోపలికి వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపినట్టు గుర్తించారు. ఇది ఉగ్రదాడి కాదని, సైనికుల మధ్యనే కాల్పులు జరిగినట్టు పంజాబ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
Punjab
Military Station
firing
4 dead
army

More Telugu News