KA Paul: కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం
  • అగ్నిప్రమాదం కాదు నరబలి అంటూ కేఏ పాల్ ఆరోపణలు
  • సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ 
  • అగ్నిప్రమాదాలపై సీబీఐ విచారణ జరపాలా అంటూ పాల్ పై కోర్టు అసహనం
Supreme Court set a side KA Paul petition

ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవనంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. సచివాలయ భవనంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నరబలి అని కేఏ పాల్ తన పిటిషన్ లో ఆరోపించారు. 

 ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాగా, కేఏ పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. అయితే, దేశంలో జరిగే అగ్నిప్రమాద ఘటనలన్నిటినీ సీబీఐతో విచారణ జరిపించమంటారా? అని కేఏ పాల్ పై అసహనం వెలిబుచ్చింది. అగ్నిప్రమాద ఘటనలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

More Telugu News