Dalailama: బాలుడికి క్షమాపణ చెప్పిన దలైలామా

Dalailama apologises to boy and his family
  • ఓ బాలుడ్ని పెదవులపై ముద్దాడిన దలైలామా
  • తన నాలుక చప్పరించాలని బాలుడ్ని కోరిన వైనం
  • దిగ్భ్రాంతి కలిగిస్తున్న వీడియో
  • అధికారిక ప్రకటన విడుదల చేసిన దలైలామా టీమ్
బౌద్ధ మత ప్రధాన గురువు దలైలామా ఓ బాలుడిని పెదవులపై ముద్దాడడం, తన నాలుకను చప్పరించాలని ఆ బాలుడ్ని కోరడం తీవ్ర సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బౌద్ధ మత అత్యున్నత గురువు అయిన దలైలామా ఇంత నీతిమాలిన చర్యకు పాల్పడడం ఏంటని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

తనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో దలైలామా స్పందించారు. బాలుడికి, బాలుడి కుటుంబానికి క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు దలైలామా బృందం ఓ ప్రకటన విడుదల చేసింది.

తనను సందర్శించేందుకు వచ్చేవారితో దలైలామా అప్పుడప్పుడు చిలిపిగా ప్రవర్తిస్తుంటారని, అయితే అందులో ఎలాంటి దుర్బుద్ధి లేదని, కల్మషం లేని రీతిలో దలైలామా సరదాగా అలా వ్యవహరిస్తుంటారని ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. 

ప్రజల్లోకి వచ్చిన సమయంలోనూ, కెమెరాల ముందు కూడా దలైలామా ఇలా కొంటెగా ప్రవర్తిస్తుంటారని, జరిగిన ఘటన పట్ల ఆయన చింతిస్తున్నారని పేర్కొంది.
Dalailama
Boy
Apology

More Telugu News