Narendra Modi: పులుల కోసం 97 దేశాల సమాఖ్య.. ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi launches global bloc to save 7 big cat species
  • ఏడు పిల్లి జాతి జంతువుల సంరక్షణకు చర్యలు
  • టెక్నాలజీ, సహకారానికి ఈ సమాఖ్య తోడ్పడుతుందన్న ప్రధాని
  • ఈ సమాఖ్యకు నేతృత్వం వహించనున్న భారత్
పులుల సంరక్షణకు 97 దేశాలు చేతులు కలిపాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిని ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు పర్యటన సందర్భంగా ప్రారంభించారు. ఏడు క్యాట్ జాతికి చెందిన ఏడు రకాల జంతువులను ఈ కూటమి కింద సంరక్షణ, పరిరక్షణ చర్యలు తీసుకుంటారు. టైగర్, లియోపార్డ్, జాగ్వార్, లయన్, స్నో లియోపార్డ్, పుమా, చీతా జాతిని కాపాడడమే ఈ సమాఖ్య లక్ష్యం.

‘‘ఈ కూటమి ఆవశ్యకత ఎంతో ఉంది. టెక్నాలజీ పంచుకోవడం, సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా పెద్ద పిల్లి జాతి జంతువులను కాపాడుకోవచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైసూరులోని కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ కన్వొకేషన్ హాల్ లో వన్యప్రాణుల శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ కూటమికి భారత్ నేతృత్వం వహించనుంది. వేట, చట్టవిరుద్ధమైన వన్యప్రాణుల వ్యాపారం వ్యతిరేకంగా చర్యలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, పర్యావరణానికీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
Narendra Modi
Prime Minister
launches
big cat species
international alliance

More Telugu News