Renu Desai: నా బాధను అర్థం చేసుకునే వ్యక్తులున్నారనే ధైర్యం వచ్చింది.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

  • సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడిన వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్
  • తనకు సపోర్ట్ గా మాట్లాడటంపై భావోద్వేగం
  • తొలిసారి నా తరపున మాట్లాడడం విని చాలా ఏడ్చానని కామెంట్
renu desai emotional post on her life and divorce with pawan kalyan

దాదాపు 11 ఏళ్ల కిందట పవన్ కల్యాణ్ నుంచి విడిపోయారు రేణూ దేశాయ్. పవన్ అభిమానులు ఇప్పటికీ ఆమెను ‘వదిన’ అనే పిలుస్తుంటారు. కానీ చాలా మంది నెగటివ్ కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో ఏప్రిల్ 8న (శనివారం) తన కొడుకు అకీరా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో రేణూ దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. 

ఓ నెటిజన్ ‘మా అన్న కొడుకు.. సరిగ్గా చూపించండి’ అంటూ కామెంట్ చేయడంపై రేణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట్లాడే పద్ధతి నేర్చుకోండి.. అకీరా నా కొడుకు’ అంటూ సీరియస్ అయ్యారు. దీనిపైనా నెటిజన్లు రేణుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు. కొందరు పెడుతున్న పోస్టులను రేణు షేర్ కూడా చేస్తున్నారు. 

తాజాగా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి చేసిన కామెంట్స్ తాలూకు వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేశారు. అందులో మహిళల పట్ల సమాజంలో చూపిస్తున్న వివక్ష గురించి కృష్ణ కుమారి ప్రస్తావించారు. హీరో హీరోయిన్లు విడిపోతే.. సమాజం ఎప్పుడూ హీరోయిన్లదే తప్పు అని వేలెత్తి చూపిస్తుందని చెప్పారు. సమంత, రేణూ దేశాయ్ గురించి మాట్లాడారు. 

‘‘పవన్ తో రేణూ దేశాయ్ సహజీవనం చేసి ఓ బిడ్డని కనేందుకు కూడా ముందుకొచ్చింది. అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు. పవన్ కల్యాణ్ కి రేణూ దేశాయ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఆ రోజు రేణు ‘నా కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. పవన్ కల్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నారు’ అని ప్రకటన చేసి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేది’’ అని చెప్పారు.

‘‘ఆమె ఎంతో మంచిది కాబట్టి.. పవన్ కల్యాణ్‌కు శిక్ష పడకుండా కాపాడింది. అలాంటి ఆవిడను పట్టుకుని ట్రోల్ చేస్తారా? ఆమె రెండో పెళ్లి చేసుకుంటాను అంటే తిడతారా? అదే మాట పవన్ కల్యాణ్‌ను ఎందుకు అడగలేకపోయారు?’’ అని కృష్ణ కుమారి నిలదీశారు.

ఈ వీడియోను రేణు షేర్ చేస్తూ.. ‘‘నాకు ఈవిడ ఎవరో తెలియదు.. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ తొలిసారి పబ్లిక్ లో నా తరపున మాట్లాడడం విని చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెప్తే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడయ్యానని అంటారు. ఈ వీడియో చూసిన తర్వాత నా బాధను అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం వచ్చింది’’ అని పేర్కొన్నారు.

రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News