Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర రేపటి షెడ్యూల్ ఇదిగో!

  • అనంతపురం జిల్లాలో లోకేశ్ యువగళం
  • ఇప్పటిదాకా 815 కిలోమీటర్లు నడిచిన లోకేశ్
  • సగటున రోజుకు 12.5 కిమీ పాదయాత్ర
  • నేటికి 64 రోజులు పూర్తి
Lokesh Yuvagalam tomorrow schedule

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. లోకేశ్ జనవరి 27న పాదయాత్ర ప్రారంభించగా, ఇప్పటివరకు 815.7 కిలోమీటర్ల దూరం నడిచారు. రోజుకు సగటున 12.5 కిలోమీటర్లపైనే నడక సాగిస్తున్నారు.

*65వ రోజు (9-4-2023) యువగళం వివరాలు:*

*శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – జంబులదిన్నె క్యాంప్ సైట్ లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో ముఖాముఖి.

9.00 – జంబులదిన్నె విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – నాగులగూడెం తండారోడ్డులో ఎస్టీ సామాజివర్గీయులతో భేటీ.

10.20 – నాగులగూడెంలో స్థానికులతో సమావేశం.

11.15 – వెస్ట్ నర్సాపురంలో కురుబ సామాజికవర్గీయులతో భేటీ.

మధ్యాహ్నం

12.25 – చినజలాల్ పురంలో వాల్మీకిలతో సమావేశం.

1.05 – చిన జలాల్ పురంలో రాయదుర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం.

2.05 – చిన జలాల్ పురంలో భోజన విరామం.

3.00 – చిన జలాల్ పురం నుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

4.00 – శింగనమల చెరువు వద్ద మత్స్యకారులతో సమావేశం.

4.40 – శింగనమల గుడివద్ద విశ్వబ్రాహ్మణులతో సమావేశం.

4.55 – అంబేద్కర్ విగ్రహం వద్ద కాపు సామాజికవర్గీయులతో భేటీ.

6.45 – సోడనపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.


More Telugu News