Salman Khan: మెరుగైన భద్రత కోసం అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్

Salman Khan reportedly bought Nissan Patrol the high end bullet proof car
  • కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు
  • ఇప్పటికే తుపాకీ లైసెన్స్ తీసుకున్న సల్మాన్
  • తాజాగా నిస్సాన్ హైఎండ్ వాహనం 'పెట్రోల్' కొనుగోలు 
  • ధర రూ.2 కోట్లు!..  ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్ రెక్కీ చేసినట్టుగా కూడా కథనాలు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ తుపాకీ లైసెన్స్ కూడా పొందారు. ఆయనకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. 

అయితే, ప్రయాణాల సమయంలో మరింత మెరుగైన భద్రత కోసం సల్మాన్ ఖాన్ కొత్తగా నిస్సాన్ 'పెట్రోల్' ఎస్ యూవీని కొనుగోలు చేశాడు. ఇది హైఎండ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. దీన్ని ఫారెన్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్నారు. నిస్సాన్ పెట్రోల్ భారత మార్కెట్లోకి ఇంకా అడుగుపెట్టలేదు. దీని ఖరీదు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. 

ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కారు. మందంగా ఉండే దీని విండ్ షీల్డ్, డోర్ గ్లాసులను బుల్లెట్లు ఏమీ చేయలేవు. ఇందులో శక్తిమంతమైన 5.6 లీటర్ వీ8 ఇంజిన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ వ్యవస్థ పొందుపరిచారు.
Salman Khan
Nissan Patrol
High End SUV
Bullet Proof
Mumbai
Bollywood

More Telugu News