ఒక్కరోజే 6 వేల కరోనా కేసులు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నేడు కేంద్రం సమావేశం
- 24 గంటల్లో 6,050 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
- వైరస్ వల్ల తాజాగా 14 మరణాల నమోదు
- 3.39 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు
కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర అప్రమత్తం అయింది. కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ‘కరోనా వ్యాప్తిపై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ప్రధాని మోదీ దీనిపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు’ అని ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.