Venu Yeldandi: ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్న 'బలగం' వేణు

Balagam Venu Yeldandi wins international award as best director
  • సంచలన విజయం సాధించిన 'బలగం' సినిమా
  • అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతున్న 'బలగం'
  • ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్న వేణు
ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే, ఘన విజయం సాధించాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, కథలో దమ్ముండి జనాల మనసుల్ని తాకితే చాలని 'బలగం' సినిమా నిరూపించింది. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా టీమ్ కృషికి అంతర్జాతీయంగా అభినందనలు అందుతున్నాయి. ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన కమెడియన్ వేణు యెల్డండి తాజాగా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్నాడు. 

ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇప్పటి వరకు లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి. తాజాగా ఉత్తమ దర్శకుడిగా వేణు అంతర్జాతీయ అవార్డును సాధించాడు. ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు.
Venu Yeldandi
Balagam
Best Director
International Award

More Telugu News