Kotamreddy Sridhar Reddy: జలదీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. గృహ నిర్బంధం చేసిన పోలీసులు

YCP Suspended MLA Kotamreddy Sridhar Reddy House Arrested
  • పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మించాలని డిమాండ్
  • జలదీక్షకు వెళ్లేందుకు సిద్ధమైన కోటంరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
  • నిరసన దీక్షకు అనుమతి లేదని స్పష్టీకరణ
  • ఇంటివద్ద బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే

పొట్టెపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ‌రెడ్డి 8 గంటల జలదీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ఈ ఉదయం సిద్ధమైన ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

నెల్లూరులోని మాగుంట లేఔట్‌లో తన నివాసం నుంచి ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై మండిపడిన కోటంరెడ్డి ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News