Dharmapuri Arvind: కేసీఆర్ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివని దేశమంతా నివ్వెరపోతోంది: ధర్మపురి అర్వింద్

All are surprising about KCRs money says Dharmapuri Arvind
  • దేశ వ్యాప్తంగా విపక్షాలకు డబ్బులు పంపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న అర్వింద్
  • లక్షల కోట్లను కేసీఆర్ ఎలా సంపాదించారనే చర్చ కొనసాగుతోందని వ్యాఖ్య
  • తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందన్న అర్వింద్
రాబోయే ఎన్నికల్లో దేశంలోని విపక్షాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు పంపించేందుకు సిద్ధమవుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ వద్ద ఉన్న డబ్బు గురించే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని... ఇన్ని లక్షల కోట్లను కేసీఆర్ ఎలా సంపాదించారని అందరూ చర్చించుకుంటున్నారని చెప్పారు. బీజేపీ నాయకులను బెదిరించి ప్రభుత్వాన్ని నడుపుతామంటే తాము తగ్గేది లేదని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉందని, రానున్న కాలంలో మరెన్ని విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలని అన్నారు. 

రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందని అర్వింద్ చెప్పారు. అందరినీ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని తన ఇంటికి కూడా పోలీసులు వచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాబోతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ అరెస్టే దానికి ఉదాహరణ అని చెప్పారు.
Dharmapuri Arvind
BJP
KCR
BRS

More Telugu News