Kollywood: సినిమాలకు విరామం ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో సుదీప్​

Kiccha Sudeep Clarifies over his break from movies
  • విక్రాంత్ రోణ తర్వాత మరో సినిమా చేయని సుదీప్ 
  • ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డానన్న కన్నడ స్టార్
  • త్వరలోనే తన నుంచి ప్రకటన వస్తుందని వెల్లడి
కన్నడ హీరో కిచ్చా సుదీప్ తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈగ సినిమాలో విలన్ గా మెప్పించిన ఆయన బాహుబలి పార్ట్ 1, సైరా నరసింహారెడ్డి లోనూ ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా నటించిన ‘విక్రాంత్ రోణ’ (వీఆర్) కన్నడతో పాటు టాలీవుడ్ లోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అయితే, వీఆర్ తర్వాత సుదీప్ మరో సినిమాలో నటించడం లేదు. దాంతో, ఆయన కెరీర్ పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా సుదీప్ అనూహ్యంగా స్పందించారు. ప్రస్తుతం తాను సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు చెబుతూ ఓ సుదీర్ఘమైన నోట్ ను విడుదల చేశారు. కెరీర్ లో మొదటిసారి ఇలా బ్రేక్ తీసుకున్నానని తెలిపారు. 

‘నా స్నేహితులందరికీ నమస్కారం. నేను సినిమాలు త్వరగా చేయడం లేదని, నా 46వ సినిమా అప్ డేట్స్ ఇవ్వడం లేదని వస్తోన్న మీమ్స్, ట్రోల్స్ చూస్తున్నాను. అయితే, విక్రాంత్ రోణ వంటి సినిమాలు తీసిన తరువాత నేను చాలా అలిసిపోయాను. కాస్త విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇది నా మొదటి విరామం. కరోనా టైంలో ఎంతో కష్టపడి ఆ సినిమాను తీశాం. బిగ్ బాస్ షోకు కూడా అదే టైంలో పని చేశాను. అందుకే నా కొరకు, నా సంతోషం కోసమే ఇలా బ్రేక్ తీసుకున్నాను. ఈ విరామంలో క్రికెట్ ఆడుకుంటూ ఉంటే నాకు ఎంతో రిలాక్సింగ్‌గా ఉంది. దాన్ని ఆస్వాదిస్తూనే రోజూ కథలు వింటున్నా. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్‌లు ఓకే అయ్యాయి. మూడు స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. త్వరలోనే ప్రకటన వస్తుంది’ అని ట్వీట్ చేశారు.
Kollywood
kiccha sudeep
break
movies
gap
Tollywood

More Telugu News