Junaid: ఇంట్లో అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి నడుపుతున్న తోబుట్టువులు.. దేశ విద్రోహ సందేశాల వ్యాప్తి

Police busted illegal telephone exchange in Ghaziabad and detain brother and sister
  • ఘజియాబాద్ లో అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి గుర్తింపు
  • విదేశాల నుంచి వచ్చే సందేశాలను లోకల్ కాల్స్ గా మార్చుతున్న వ్యక్తులు
  • ఇటీవల అహ్మదాబాద్ వచ్చిన మోదీ, ఆసీస్ ప్రధాని అల్బనీస్
  • ఈ పర్యటనకు ముందు ఎక్చేంజి ద్వారా బెదిరింపు సందేశం వ్యాప్తి
అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ ఇంటిపై దాడి చేసి అక్రమ టెలిఫోన్ ఎక్చేంజిని గుర్తించారు. జునైద్ అనే వ్యక్తిని, అతని సోదరి రిహానాను అరెస్ట్ చేశారు. 

కిందట నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అహ్మదాబాద్ లో భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్ కు విచ్చేశారు. అయితే వారి రాకకు ముందు, ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ ఖలిస్తాన్ ఉగ్రవాది గుర్ పవంత్ సింగ్ పన్నూ పేరిట ఓ ఆడియో సందేశం వైరల్ అయింది. ఈ ప్రీ రికార్డెడ్ ఆడియో సందేశం ఘజియాబాద్ లోని ఇంట్లో ఉన్న అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి నుంచి వెలువడినట్టు గుర్తించారు. 

ఈ దాడుల్లో ఏటీఎస్ పోలీసులు పెద్ద సంఖ్యలో మొబైల్ సిమ్ కార్డులు, ఒక శాటిలైట్ ఫోన్, 6 మొబైల్ ఫోన్లు, పలు టెలిఫోన్ ఎక్చేంజి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, విదేశాల నుంచి వచ్చే ప్రీ రికార్డెడ్ సందేశాలను జునైద్, రిహానా ఈ అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి ద్వారా లోకల్ గా మార్చి, వాటిని వివిధ ఫోన్ నెంబర్లకు పంపించేవారు. 

కాగా, ఈ టెలిఫోన్ ఎక్చేంజిని బిసోఖర్ లోని అష్ఫాక్ అనే వ్యక్తి ఇంటి పైఅంతస్తులో నిర్వహించేవారు. వీరి వద్ద ఉన్న పరికరాల నుంచి కాల్ చేస్తే ఎక్కడ్నించి వచ్చాయో తెలుసుకోవడం కష్టమని భావిస్తున్నారు. వీరు రోజుకు 26 వేల కాల్స్ చేసేవారని వెల్లడైంది.
Junaid
Rihanna
Telephone Exchange
Bisokhar
Ghaziabad
ATS
Ahmedabad

More Telugu News