KJ Yesudas: ఏసుదాసు కుమారుడి ఇంట్లో భారీ చోరీ

Gold and diamond ornaments theft in KJ Yesudas sons residence
  • 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలు మాయం
  • చెన్నై అభిరామపురం పోలీసులకు విజయ్ భార్య ఫిర్యాదు
  • ఇంట్లో పని చేస్తున్నవారిపైనే అనుమానం
సుప్రసిద్ధ సినీ గాయకులు కేజే ఏసుదాసు కుమారుడు విజయ్ నివాసంలో భారీ చోరీ జరిగింది. 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలను దొంగతనం చేశారు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విజయ్ భార్య చెన్నైలోని అభిరామపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పని చేస్తున్నవారే చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయ్ నివాసంలో ఇప్పటివరకు పని చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. 60 సవర్ల నగలను చోరీ చేశారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పనిచేస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
KJ Yesudas
Son
Vijay
Theft

More Telugu News