Enforcement Directorate: హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు

ED Raids In Pharmacy Company And 15 Places Of Hyderabad
  • ఫార్మా కంపెనీలలో అధికారుల సోదాలు
  • నకిలీ ఔషధాలు తయారుచేస్తున్న కంపెనీలపై కొరడా
  • కంపెనీల డైరెక్టర్లు, ఉన్నతాధికారుల ఇళ్లపై రైడ్స్
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. నకిలీ, నాసిరకం మందులు తయారుచేస్తున్న కంపెనీల గుట్టును ఇటీవలే అధికారులు రట్టు చేశారు. మొత్తం 18 ఫార్మా కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు. ఇందులో భాగంగానే శనివారం తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్ చెరు, మాదాపూర్ లలోని ఫార్మా కంపెనీలు, ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు సహా మొత్తం 15 చోట్ల ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. పల్స్ ఫార్మా, ఫీనిక్స్ టెక్ జోన్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపైనా అధికారులు రైడ్ చేశారు. 

నకిలీ మందుల విషయంలో ఇటీవల డబ్ల్యూహెచ్ వో అలర్ట్ చేయడంతో మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్న 100 కు పైగా కంపెనీలపై రైడ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇందులో 18 కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు. ఇందులో క్యాన్సర్ ను నయం చేసే మందు పేరుతో నాసిరకం మందు తయారు చేస్తున్న సెలాన్ ఫార్మా కంపెనీ కూడా ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

నోయిడాలో తయారైన మందుల వాడిన పలువురు ఉజ్బెకిస్తాన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటనతో డబ్ల్యూ హెచ్ వో ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ, నాసిరకం మందుల తయారీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో నోయిడా లోని మెయిడెన్ ఫార్మా పై మొదట దాడి డ్రగ్ కంట్రోల్ అధికారులు చేశారు. అక్కడ ఉన్న ఔషధాలను పరిశీలించగా అందులో ఎతిలిన్ గ్లైకోల్, డీ ఎథిలిన్ గ్లైకోల్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించడంతో వెంటనే మెయిడెన్ ఫార్మా లైసెన్సును రద్దు చేశారు.
Enforcement Directorate
pharma companies
raids
Hyderabad

More Telugu News