Ramcharan: ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టిన 'ఆరెంజ్'

Orange movie re release collections
  • చరణ్ హీరోగా గతంలో వచ్చిన 'ఆరెంజ్'
  • నాగబాబును నష్టాలపాలు చేసిన సినిమా
  • చరణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ 
  • 3 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమా
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన నాగబాబు

చరణ్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'ఆరెంజ్' సినిమా రూపొందింది. నాగబాబు తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా, 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రభు .. ప్రకాశ్ రాజ్ .. బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ప్రేమకథను డిఫరెంట్ గా చెప్పడానికీ .. చరణ్ పాత్రను కొత్త కోణంలో చూపించడానికి భాస్కర్ ప్రయత్నించాడు. అయితే ఆయన ఆలోచనా విధానం .. కొత్తగా చెప్పాలనుకున్న పాయింట్ యూత్ కి కనెక్ట్ కాలేదు. దాంతో ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. నాగబాబును నష్టాలపాలు చేసింది.

అలాంటి ఈ సినిమాను ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా నాగబాబు రీ రిలీజ్ చేశారు. మూడు రోజుల పాటు ప్రదర్శితమయ్యే ఈ సినిమా వలన వచ్చే డబ్బులు, 'జనసేన' పార్టీకి ఇస్తానని నాగబాబు అన్నారు. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా 3 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని నాగబాబు అధికారికంగా ప్రకటిస్తూ, రీ రిలీజ్ లో ఈ సినిమా హిట్ కావడం విశేషం" అంటూ హర్షాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News