Chandrababu: సత్యకుమార్ కారుపై రాళ్ల దాడిని ఖండించిన చంద్రబాబు

Chandrababu condemns attack on BJP leader Sathya Kumar car
  • అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సత్యకుమార్
  • సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి
  • వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారన్న చంద్రబాబు

అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికేందుకు వచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై  వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. 

కారుపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. పక్కా ప్రణాళికతోనే వైసీపీ గూండాలు దాడి చేసినట్టు అర్థమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News