ఎవరికెన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ కు ఎలా తెలుసు?: రేవంత్ రెడ్డి
- కొనసాగుతున్న టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ రగడ
- ఈడీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి
- కేటీఆర్ ఓ నీచుడు అని ఘాటు వ్యాఖ్యలు
- కేటీఆర్ ఏం చెబుతున్నారో సిట్ అదే చేస్తోందని ఆరోపణలు
కేటీఆర్ ఒక నీచుడు.... నాకు నోటీసులు ఇచ్చేదేంది? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పరువు ఖరీదు రూ.100 కోట్లు. ఆ వంద కోట్లు వస్తే కేటీఆర్ ను ఎన్ని బూతులైనా తిట్టుకోవచ్చా? అంటూ రేవంత్ వ్యంగ్యం ప్రదర్శించారు.
ఎవరికెన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ కు ఎలా తెలుసని ప్రశ్నించారు. పేపర్ దొంగలు ఏమైనా సమాచారం ఇచ్చారా... పబ్లిక్ డొమైన్ లో లేని సమాచారం కేటీఆర్ కు తెలిసిందని నిలదీశారు.
పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ ఏం చెబుతున్నారో సిట్ అదే చేస్తోందని రేవంత్ మండిపడ్డారు. దమ్ముంటే ఈ కేసు సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో విచారణ జరపాలంటూ ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.