మొదటిసారి 'దసరా' కథ విన్నప్పుడు నో చెప్పడానికి కారణం ఉంది: కీర్తి సురేశ్

  • 'దసరా' గురించి ప్రస్తావించిన కీర్తి సురేశ్
  • మొదటిసారి కథ విన్నప్పుడు కథ అర్థం కాలేదని వ్యాఖ్య  
  • అందువల్లనే నో చెప్పడం జరిగిందని వెల్లడి 
  • అలా ఆ కథ రెండోసారి తన దగ్గరికి వచ్చిందని వివరణ
Keerthi Suresh Interview

తెలుగులో 'సర్కారువారి పాట' తరువాత కీర్తి సురేశ్ చేసిన సినిమానే 'దసరా'. నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ చేసిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో 38 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 

తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. "మొదటి సారి శ్రీకాంత్ ఓదెల నా దగ్గరికి కథను తీసుకుని వచ్చి నాకు వినిపించారు. ఆయన చెప్పిన కథలో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ముఖ్యంగా ఆ కథలోని యాస వలన మరీ అయోమయంగా అనిపించింది. దాంతో నేను ఆ సినిమా చేయలేనని చెప్పాను" అని అన్నారు. 

ఆ తరువాత కొన్ని రోజులకు వేరే పనిమీద నేను నానీకి కాల్ చేస్తే, 'దసరా' సినిమాను గురించి ప్రస్తావించారు. 'నువ్వు కథను విన్నావటగదా .. నీకు నచ్చలేదట గదా' అన్నారు. నాకు కొంచెం ట్రాన్స్ లేట్ చేసి చెప్పాలి .. వేరే ఎవరినైనా వచ్చి వినపించమని చెప్పండి" అన్నాను. అలా రెండోసారి ఈ కథను విని ఓకే చెప్పడం జరిగింది' అని చెప్పుకొచ్చారు. 

More Telugu News