నేను యాక్టింగ్ వైపు రావడం మా పేరెంట్స్ కి ఇష్టం లేదు: మృణాల్ ఠాకూర్

  • 'సీతా రామం'తో పరిచయమైన మృణాళ్ ఠాకూర్
  • టీవీ సీరియల్స్ ఇచ్చిన గుర్తింపు గురించి ప్రస్తావన 
  • స్మితా పాటిల్ తో పోల్చుతున్నారని హర్షం 
  • తనకి చాలా గర్వంగా ఉందని వ్యాఖ్య
Mrunal Thakur Interview

కొంతమంది కథానాయికలకు స్టార్ డమ్ రావడానికి చాలా సమయం పడుతుంది. మరికొంతమంది కథానాయికలకు ఫస్టు సినిమాతోనే స్టార్ డమ్ వస్తుంది. ఈ రెండో కేటగిరిలోనే మృణాల్ ఠాకూర్ కనిపిస్తుంది. తెలుగులో మొదటి సినిమాగా ఆమె చేసిన 'సీతా రామం' సంచలన విజయాన్ని సాధించింది. ఇతర భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. 

అలాంటి మృణాళ్ ఠాకూర్ తాజాగా ఓ స్టేజ్ పై మాట్లాడుతూ .. "మాది మరాఠీ ఫ్యామిలీ .. నేను యాక్టింగ్ వైపు రావడం మా పేరెంట్స్ కి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అటు టీవీ అయినా .. ఇటు సినిమా అయినా అసలు ఈ ఇండస్ట్రీ గురించి వారికి పెద్దగా తెలియకపోవడమే అందుకు కారణం. అందువల్లనే వారు నన్ను సపోర్ట్ చేయలేకపోయారు" అన్నారు. 

"నేను టీవీ సీరియల్స్ లో నటిస్తూ వెళ్లాను. అక్కడ వచ్చిన గుర్తింపు నన్ను సినిమాల వైపు తీసుకుని వెళ్లింది. నేను ఎంచుకున్న కథలు .. పాత్రలు నాకు మంచి పేరును తీసుకుని వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది నన్ను స్మితా పాటిల్ తో పోల్చుతున్నారు. నిజంగా నేను గర్వించదగిన విషయమే ఇది. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు" అని చెప్పుకొచ్చ్చారు. 

More Telugu News