UPI payments: ఫోన్ పే, పేటీఎం వ్యాలెట్లకు లోడ్ చేసినా చార్జీ

  • 0.15 శాతం చార్జీ చెల్లించాల్సిన పరిస్థితి
  • రూ.2,000కు మించి చేసే చార్జీలపై వర్తకులకు 1.1 శాతం చార్జీ
  • వ్యక్తుల మధ్య యూపీఐ లావాదేవీలపై చార్జీల్లేవు
Which UPI payments will attract interchange fee Will you have to bear the cost

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) మర్చంట్ యూపీఐ లావాదేవీలపై చార్జీలను ప్రకటించింది. వర్తకులకు ప్రీపెయిడ్ సాధనాల నుంచి చేసే చెల్లింపు విలువ రూ.2,000 కు మించి ఉన్నప్పుడే ఈ చార్జీ పడుతుంది. ఈ విషయంలో చాలా మందికి సందేహాలు నెలకొన్నాయి. తాజా ఆదేశాల సారాంశాన్ని మరింత స్పష్టంగా తెలుసుకుందాం.

మీరు ఓ షాపు వద్దకు వెళ్లి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, బ్యాంక్ ఖాతా నుంచే నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారని అనుకుందాం. ఒకవేళ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా.. అప్పటికే ఫోన్ పే లేదా పేటీఎం వ్యాలెట్ లో లోడ్ చేసిన బ్యాలన్స్ నుంచి రూ.2,000కు పైగా చెల్లిస్తున్నట్టు అయితే.. ఈ రెండు కేసుల్లోనూ 1.1 శాతం ఇంటర్ చేంజ్ చార్జీ పడుతుంది. ఇది కూడా మీరు చెల్లించక్కర్లేదు. వర్తకుడిపైనే ఈ భారం పడుతుంది. వర్తకుడి బ్యాంక్ ఈ చార్జీలను చెల్లించిన బ్యాంక్ కు లేదా ఫోన్ పే లేదా పేటీఎంకు జమ చేస్తుంది. క్రెడిట్ కార్డులపై ఎండీఎస్ మాదిరే ఇది కూడా. షాపులో కార్డుతో స్వైప్ చేసిన చెల్లింపులు చేసినప్పుడు.. నగదు జమ అయిన బ్యాంక్, చెల్లింపులు చేసిన కార్డు సంస్థకు నిర్ణీత శాతం మేర చెల్లించాల్సి ఉంటుంది.

వ్యక్తుల మధ్య యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీల్లేవు. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. పేటీఎం, ఫోన్ పే వ్యాలెట్లు ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్ల కిందకు వస్తాయి. అలాగే, స్మార్ట్ కార్డులు, సొడెక్స్ తరహా వోచర్లు, మాగ్నటైజ్డ్ చిప్ ఉన్నవి ప్రీపెయిడ్ సాధనాలే అవుతాయి. మర్చంట్ కేటగిరీ కోడ్ ఆధారంగా ఇంటర్ చేంజ్ ఫీజు ఆధారపడి ఉంటుంది. వాహనాల్లోకి వినియోగించే ఇంధనం, విద్య, వ్యవసాయం, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై ఇంటర్ చేంజ్ ఫీజు 0.50 శాతం పడుతుంది. రిటైల్ అవుట్ లెట్లు, రెస్టారెంట్లు తదితర చోట 1.1 శాతం ఇంటర్ చేంజ్ ఫీజు అమలవుతుంది. 

తాజా ఆదేశాలు అధిక విలువ కలిగిన లావాదేవీలపై ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కొందరు వర్తకులు క్రెడిట్ కార్డు చెల్లింపులను స్వీకరించడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. తమపై 1-2 శాతం చార్జీ పడుతోందని చెబుతుంటారు. అదే మాదిరి ఇక మీదట రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులను వర్తకులు అందరూ ఆమోదించకపోవచ్చు. ఎందుకంటే వారిపై చార్జీ పడడమే కారణం. అలాగే, మీరు ఫోన్ పే, లేదా పేటీఎం వ్యాలెట్ కు రూ.2,001, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 0.15 శాతం చార్జీ పడుతుంది. అంటే అప్పుడు పేటీఎం లేదా ఫోన్ పే సంబంధిత యూజర్ బ్యాంకుకు చెల్లించాల్సి వస్తుంది.

More Telugu News