Tamil Nadu: తమిళనాట మరో వివాదం.. ‘దహీ’ పదం చుట్టూ లొల్లి

FSSAI orders over the use of Dahi on curd packets creates stir in Tamilnadu
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో మరో భాషాపరమైన వివాదం మొదలైంది. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే హిందీ పదం ముద్రించాలన్న ఆదేశాలతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందినీ డెయిరీకి నోటీసులు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళలోని కొన్ని డెయిరీలకు ఈ నోటీసులు వెళ్లాయి. పెరుగు ప్యాకెట్లపై ‘కర్డ్’ అనే ఆంగ్ల పదానికి బదులు దహీ అనే హిందీ పదం వాడాలనేది ఈ ఆదేశాల సారాంశం. 

ఈ నోటీసులపై తమిళనాడు సీఎం ఎమ్.కే. స్టాలిన్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఆదేశాలు అమలయితే భాషా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తమిళనాడులోని పాల ఉత్పత్తి దారుల సంఘం కూడా ఈ విషయమై అత్యవసరంగా సమావేశమైంది.
Go Back to Shorts
Tamil Nadu

More Telugu News