Divya S Iyer: ఆరేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యా: పథనంథిట్ట కలెక్టర్ దివ్య

Divya S Iyer IAS reveals attempt of sexual abuse faced in childhood
  • ఇద్దరు వ్యక్తులు ఆప్యాయంగా పిలవడంతో  వెళ్లానన్న కలెక్టర్
  • వారు తన దుస్తులు విప్పినప్పుడు భయంతో పారిపోయానని వెల్లడి
  • తల్లిదండ్రుల సహకారంతో ఆ బాధ నుంచి బయటపడ్డానన్న ఐఏఎస్
  • పసిప్రాయంలో తీవ్ర మానసిక క్షోభ అనుభవించానన్న దివ్య
తాము చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెబుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ సహా పలువురు ప్రముఖులు తాము పసిప్రాయంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తాజాగా, ఈ జాబితాలోకి కేరళలోని పథనంథిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్. అయ్యర్ చేరారు.

తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని ఆమె తెలిపారు. రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో దివ్య మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు తనను ఆప్యాయంగా పిలవడంతో వెళ్లానని, వారు తనను ఎందుకు ముట్టుకున్నారో, ఆప్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేకపోయానని అన్నారు. వారు తన దుస్తులు విప్పినప్పుడు అక్కడి నుంచి పారిపోయానని అన్నారు. 

ఆ ఘటనతో ఆ వయసులోనే తాను తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్టు వివరించారు. అయితే, తల్లిదండ్రుల సహకారంతో ఆ బాధ నుంచి తాను బయటపడ్డానన్నారు. ఆ తర్వాత వారు కనిపిస్తారేమోనని చూశాను కానీ, కనిపించలేదని, అయితే వారి ముఖాలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నట్టు దివ్య చెప్పారు.
Divya S Iyer
Kerala
Pathanamthitta

More Telugu News