పులివెందుల కాల్పుల ఘటన... పోలీసుల ఎదుట లొంగిపోయిన భరత్

  • పులివెందులలో నిన్న కాల్పుల ఘటన
  • దిలీప్ అనే వ్యక్తి మృతి
  • కాల్పులు జరిపి పరారైన భరత్ కుమార్ యాదవ్
  • మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్న డీఎస్పీ
  • హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని వెల్లడి
Pulivendula shooter Bharat surrender before police

కడప జిల్లా పులివెందులలో నిన్న కాల్పుల ఘటన చోటుచేసుకోగా, దిలీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పరారయ్యాడు. అయితే, నిందితుడు భరత్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. 

పులివెందుల కాల్పుల ఘటనపై డీఎస్పీ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని వెల్లడించారు. నిందితుడి నుంచి తుపాకీ, రెండు తూటాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మృతుడు దిలీప్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు.

More Telugu News