Chinnaiah: హైదరాబాదులో వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్

CID arrests white collar fraudster Chinnaiah
  • చర్చి ట్రస్టు పేరుతో రూ.6 కోట్లు వసూలు
  • గత పదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న చిన్నయ్య
  • అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
  • రూ.10,500 చెల్లిస్తే రూ.2,500 పెన్షన్ ఇస్తామంటూ ఘరానా మోసం
  • తెలంగాణలో చిన్నయ్యపై 14 కేసులు
ఘరానా మోసగాడు చిన్నయ్యను హైదరాబాదులో నేడు అరెస్ట్ చేశారు. చిన్నయ్య చర్చి ట్రస్టు పేరిట రూ.6 కోట్లు వసూలు చేసి, పరారీలో ఉన్నాడు. పదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్యను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.10,500 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే రూ.2,500 పెన్షన్ ఇస్తామని చిన్నయ్య భారీ మోసానికి తెరదీశాడు. 

అతడి మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో ప్రజలు డిపాజిట్ కట్టారు. లిటిల్ లాంబ్ బాప్టిస్ట్ చర్చి మినిస్ట్రీస్ (ఎల్ఎల్ బీసీఎమ్) పేరిట చిన్నయ్య ఈ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. చిన్నయ్యపై తెలంగాణలో 14 కేసులు ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.
Chinnaiah
Cheating
Fraud
LLBCM
CID
Telangana

More Telugu News