Drinking Coke: కోక్ తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందట.. తాజా అధ్యయనంలో వెల్లడి

  • చైనాలోని మింజు యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం
  • ఎలుకలపై చేసిన పరీక్షల్లో ఆసక్తికర ఫలితాలు
  • కోక్ డ్రింక్స్ ఇచ్చిన ఎలుకల్లో పెరిగిన టెస్టో స్టెరాన్
Shocking Drinking Coke and Pepsi may improve mens sexual health claims study

కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచి చేయవని ఇప్పటి వరకు తెలిసిన విషయం. ఇవి కార్బోనేటెడ్ డ్రింక్స్. వీటిల్లో చక్కెర పాళ్లు ఎక్కువ. వీటిల్లో స్వల్ప స్థాయిలో క్రిమిసంహారకాలు ఉన్నాయంటూ ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ, పెప్సీ, కోకాకోలా, థమ్స్ అప్ తరహా కార్బోనేటెడ్ డ్రింక్స్ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. 

పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ను పెంచుతాయని, దీంతో పురుషుల సహజ లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుందని, అండాల వృద్ధికి మేలు చేస్తుందని చైనాలోని నార్త్ వెస్ట్ మింజు యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఆక్టా ఎండోక్రినాల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. సోడాలను తాగితే అది పునరుత్పత్తి సామర్థ్యం, వీర్యం నాణ్యతపై ప్రభావం పడుతుందని గత అధ్యయనాలు చెప్పగా.. తాజా అధ్యయనం భిన్నమైన ఫలితాలను ప్రకటించడం గమనార్హం.

పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా మగ ఎలుకలను పలు బృందాలుగా చేసి, 15 రోజుల పాటు పరీక్షించి చూశారు. కోకకోలా, పెప్సీని ఒక సమూహంలోని ఎలుకలకు ఇవ్వగా, మరో సమూహంలోని వాటికి సాధారణ నీటిని ఇచ్చారు. ఫిజ్జీ డ్రింక్స్ తాగిన వాటిల్లో టెస్టో స్టెరాన్ విడుదల పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. మానవాభివృద్ధికి సంబంధించి యంత్రాంగాలను అర్థం చేసుకోవడానికి తాజా ఫలితాలు తోడ్పడతాయని.. సోడాకి, సంతాన సాఫల్యతకు మధ్య ఉన్న బంధంపై మరింత విస్తృతమైన పరిశోధనలు అవసరమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

More Telugu News