పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం
- పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాల్సిందేనంటున్న కేంద్రం
- ఇప్పటికే పలు దఫాలుగా గడువు పెంపు
- పాత గడువు మార్చి 31తో ముగియనున్న వైనం
- కొత్తగా జూన్ 30 వరకు గడువు పొడిగింపు
చెల్లుబాటు కాని పాన్ తో బ్యాంకు అకౌంట్లు, డీమ్యాట్ అకౌంట్లు తెరవడం సాధ్యం కాదు. మ్యూచువల్ ఫండ్ లు తీసుకునేందుకు కూడా నిబంధనలు అంగీకరించవు. కాగా, పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును పెంచినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వివరించింది.