కరడుగట్టిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు

  • అతీక్ అహ్మద్ కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్ రాజ్ లోని కోర్టు
  • అతీక్ సోదరుడు అష్రఫ్ సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
  • ఆతిక్ అహ్మద్ పై కనీసం 100 క్రిమినల్ కేసులు
life imprisonment for UP gangster

ఉత్తరప్రదేశ్ కి చెందిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ లోని కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. 2006లో ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయన సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్‌ సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే అయిన అతీక్ అహ్మద్ పై 100కుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో మర్డర్, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. గత ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లో కారు నుంచి దిగుతున్న ఉమేశ్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు గన్ మెన్లు కూడా చనిపోయారు.

More Telugu News