Chiranjeevi: రామ్ చరణ్ పుట్టినరోజున చిరంజీవి ఇంటికి తరలివచ్చిన టాలీవుడ్... ఫొటోలు ఇవిగో!

Tollywood biggies landed in Chiranjeevi residence for Ram Charan birthday bash
  • నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు
  • గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన చిరంజీవి
  • చిరంజీవి నివాసంలో తారా తోరణం
  • ఇండియన్, కాంటినెంటల్ వంటకాలతో భారీ విందు
మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో సంతోషసాగరంలో మునకలేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ కావడమే కాదు, ఆస్కార్ వరకు వెళ్లి నాటు నాటు పాటకు అవార్డు కూడా అందుకోవడం, ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటనకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు కురుస్తుండడం ఆయన ఆనందానికి కారణం. 

సరిగ్గా ఈ సమయంలోనే రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) రావడంతో చిరంజీవి తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకకు టాలీవుడ్ ప్రముఖులను, రామ్ చరణ్ సన్నిహితులను ఆహ్వానించారు. దాంతో నిన్నటి వేడుకలో టాలీవుడ్ తారాలోకం కాంతులీనింది. నాటు నాటు పాటకు ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్ కు చిరంజీవి సన్మానం చేశారు. 

ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సంబరాలకు ఆర్ఆర్ఆర్ టీమ్ లోని రాజమౌళి, రమ, కీరవాణి, శ్రీవల్లి, ఎస్ఎస్ కార్తికేయ, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, కెమెరామన్ సెంథిల్ కుమార్ లతో పాటు విక్టరీ వెంకటేశ్, నాగార్జున, అమల, రానా, మిహిక, సాయితేజ్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, జగపతిబాబు, అడవి శేష్, నాగచైతన్య, అఖిల్ అక్కినేని, మంచు మనోజ్, మౌనిక, మంచు లక్ష్మీప్రసన్న, నిఖిల్, వైష్ణవ్ తేజ్ తదితర నటులు విచ్చేశారు. 

సుకుమార్, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, దర్శకురాలు నందినీ రెడ్డి, ఉత్తేజ్, సంగీత దర్శకుడు తమన్, టాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాతలు చిరంజీవి ఇంట రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. చిరంజీవి సోదరీమణి మాధవి, సోదరుడు నాగబాబు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. భర్తతో కలిసి కాజల్ అగర్వాల్ కూడా ఈ వేడుకకు హాజరైంది.

ఈ సందర్భంగా అతిథుల కోసం భారతీయ వంటకాలతో పాటు కాంటినెంటల్ వంటకాలను కూడా ప్రత్యేకంగా వండి వడ్డించారు. ఈ వేడుకలో రామ్ చరణ్-ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్ చరణ్ బర్త్ డే బాయ్ కాగా, ఉపాసన గర్భం దాల్చి ఉండడంతో అందరి దృష్టి వారిపైనే నిలిచింది.
Chiranjeevi
Ramcharan
Birthday
Hyderabad
Tollywood

More Telugu News