Chiranjeevi: రామ్ చరణ్ పుట్టినరోజున ఆస్కార్ విన్నర్లకు చిరంజీవి సత్కారం

Chiranajeevi felicitated Oscar winners on Ram Charan birthday
  • ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్
  • నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు
  • ఆర్ఆర్ఆర్ యూనిట్ ను ఆహ్వానించిన చిరంజీవి
  • సినీ ప్రముఖుల సమక్షంలో ఆస్కార్ విజేతలను గౌరవించిన చిరంజీవి దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిన్న (మార్చి 27) పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాసం సినీ ప్రముఖులతో కళకళలాడింది. ఎందుకంటే, తనయుడి జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఆస్కార్ అవార్డు (నాటు నాటు పాట) విజేతలను తన ఇంట సత్కరించారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రబృందంలోని రాజమౌళి-రమ, కీరవాణి-శ్రీవల్లి, డీవీవీ దానయ్య, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎస్ఎస్ కార్తికేయలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి గౌరవించారు. 

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, నాగార్జున,వెంకటేశ్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అడివి శేష్, అఖిల్ అక్కినేని, అమల, అల్లు అరవింద్, దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, నవీన్ యెర్నేని తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ఇవాళ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

రామ్ చరణ్ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజంగా ఓ వేడుకలా జరిగిందని చిరంజీవి వెల్లడించారు. భారతీయ సినిమా గొప్పదనాన్ని చాటుతూ తెలుగువాళ్లు సాధించిన ఈ ఘనత చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
Chiranjeevi
Ram Charan
Birthday
Oscar Winners
Naatu Naatu
RRR
Tollywood

More Telugu News