తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన
- టీఎస్ పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏపై ఆరోపణలు
- తన పీఏ వెంట పడుతున్నారేంటి అంటూ కేటీఆర్ ఆగ్రహం
- రేవంత్, బండి సంజయ్ ఎప్పుడైనా పరీక్షలు రాశారా అంటూ వ్యంగ్యం
- నకిలీ సర్టిఫికెట్లతో నిజామాబాద్ ఎంపీ దొరికిపోయాడని ఎద్దేవా
మల్యాలలో 415 మంది పరీక్ష రాయగా 35 మంది అర్హత సాధించారని వివరించారు. సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది పరీక్షలు రాస్తే ఒక్కరికి కూడా 100 మార్కులు దాటలేదని స్పష్టం చేశారు. మరి నేను లీక్ చేసింది ఎక్కడ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, బండి సంజయ్ తమ జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశారా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. నకిలీ సర్టిఫికెట్లతో దొరికిపోయింది ఎవరు... నిజామాబాద్ ఎంపీ కాదా? అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు చెప్పాను... రేవంత్ రెడ్డీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అని నిలదీశారు.