Mumbai Indians: డబ్ల్యూపీఎల్ టైటిల్ విజేత ముంబయి ఇండియన్స్

  • ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో విక్టరీ
  • 132 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించిన ముంబయి
  • 60 పరుగులతో అదరగొట్టిన నాట్ షివర్
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్
Mumbai Indians has won the inaugural WPL title

భారత్ లో తొలిసారిగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఫైనల్లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

132 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాట్ షివర్ 60 పరుగులతో అజేయంగా నిలిచి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించింది. 55 బంతులు ఎదుర్కొన్న షివర్ 7 బౌండరీలు బాదింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. 

ఛేదనలో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబయి ఇండియన్స్ ను నాట్ షివర్, హర్మన్ ప్రీత్ జోడీ ఆదుకుంది. హర్మన్ ప్రీత్ అవుటైనా... మీలీ కెర్ (14 నాటౌట్) సహకారంతో నాట్ షివర్ మిగతా పని పూర్తి చేసింది. 

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది.

More Telugu News