Nara Lokesh: టాలెంట్ ఉన్న యువతకు, పార్టీ కోసం కష్టపడేవారికే ప్రాధాన్యత: లోకేశ్

 • పుట్టపర్తి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
 • పెనుకొండ నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం
 • వివిధ వర్గాల వారితో లోకేశ్ భేటీ
 • తెలుగు మీడియం ప్రాధాన్యతపై స్పందించిన లోకేశ్
 • తాను ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నానని వెల్లడి
 • తెలుగులో మాట్లాడేందుకు ఇబ్బందిపడ్డానని వివరణ
Nara Lokesh Yuvagalam Padayatra details

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రెండురోజుల పాటు విజయవంతంగా సాగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం సాయంత్రం పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెనుకొండ నియోజకవర్గ ఇంఛార్జ్ పార్థసారధి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. 

కాగా, లోకేశ్ పాదయాత్రకు బయలుదేరే ముందు రామయ్యపేట విడిది కేంద్రం వ‌ద్ద భగవాన్ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలు వేసి న‌మ‌స్కరించారు. విద్య‌, విజ్ఞానం, వైద్యారోగ్యం, సేవా కార్యక్రమాలు చేప‌ట్టిన భ‌గ‌వాన్ స‌త్యసాయి బాబా స్ఫూర్తితో ప్రజాసేవ‌కి అంకితం అవుతాన‌ని ప్రతిజ్ఞ చేశారు. పాదయాత్రలో లోకేశ్ ను నేడు ఆటో కార్మికులు, మహిళలు కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పగడాలపల్లి వద్ద భోజన విరామ స్థలంలో బీసీలు, యువకులతో లోకేశ్ సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. 

లోకేశ్ హామీలు, మాటల తూటాలు...

 • బీసీలే వైసీపీకి బ్యాక్ బోన్ క్లాస్ అంటూ మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన‌ మోస‌పు మోహ‌న్ రెడ్డి వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల వెన్ను విరిచేశారు.
 • బీసీల సంక్షేమానికి నిధులు సాధిస్తాడ‌ని గోరంట్ల మాధ‌వ్‌ని గెలిపించి పార్లమెంటుకి పంపితే ఆయ‌న ఏంచేశారు?
 • ఎమ్మెల్యే దోపిడికుంట శ్రీధర్ రెడ్డికి ఓటేసిన పాపానికి బీసీలను తొక్కేస్తున్నాడు. బీసీల‌పై ఎవరు దాడి చేసినా జైలుకు పోతారు. 
 • చంద్రబాబు సీఎం అయ్యాకే వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వడ్డెర్లకు క్వారీలు ఇస్తే వాటిని పాపాల పెద్దిరెడ్డి లాక్కున్నారు.
 • చట్టసభల్లో 40 శాతం యువతకు అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు
 • రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తాం
 • భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన వారిని స్పోర్ట్స్ కోటాలో  గ్రూపు-1 ర్యాంకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర చంద్రబాబుది.
 • పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని మళ్లీ తీసుకొస్తాం
 • పక్క రాష్ట్రాల పేపర్ తెరిస్తే పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఏపీ పేపర్ తెరిస్తే కేసులు, కబ్జాలు, ఆక్రమణలు, దందాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 
 • గత ప్రభుత్వంలో ఏపీకి వచ్చిన పరిశ్రమలు, కంపెనీలు, వాటి అనుంబంధ సంస్థలను జగన్ రెడ్డి ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు తరిమేసింది. 
 • రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నోరెత్తితే జగన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధిస్తోంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో స్పందించినా సీఐడీ కేసులతో వేధిస్తోంది. 
 • యువతకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు, వారిని చైతన్యపరిచేందుకే యువగళం ప్రారంభించాను. 
 • టాలెంట్ ఉన్న యువతకు, పార్టీ కోసం కష్టపడేవారికి ప‌ద‌వుల్లో ప్రాధాన్యం ఇస్తాం.
 • రాష్ట్రంలోని మహిళలను కించపర్చేలా మహిళా మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు చేయాలంటే నేరస్తులు వణికిపోయేవారు. ఒకసారి అత్యాచారం చేసిన వ్యక్తి పోలీసులు తనను ఏం చేస్తారోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గెలిచిన తర్వాత కూడా అసభ్యకర పోస్టులు పెట్టారు. వంగలపూడి అనితపై కూడా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు చెత్త పోస్టులు పెట్టారు. వారిని జగన్ రెడ్డి వెనకుండి ప్రోత్సహిస్తున్నారు.
 • జగన్ రెడ్డి ప్రభుత్వంలో  విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భారంతో నలిగిపోతున్నారు. చదువు పూర్తి అయినా ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. 
 • మేం అధికారంలోకి వచ్చాక విద్యాసంస్థల్లో పెండింగ్ లో ఉన్న మార్కుల లిస్టులను వన్ టైం సెటిల్ మెంట్ తో సర్టిఫికెట్లు ఇప్పిస్తాం.
 • ఇంగ్లీషు మీడియంను బలవంతంగా రుద్దం
 • విద్యార్థులపై ఇంగ్లీషు మీడియాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోంది. విద్యార్థులకు తెలుగు మీడియం ఆప్షన్ ఉండాలని నేను భావిస్తున్నాను. 
 • నేను ఇంగ్లీషు మీడియంలో చదువుకుని తెలుగులో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిపడ్డాను. అందుకే నా కొడుకు దేవాన్ష్ కి చిన్నప్పటి నుండే తెలుగు భాషలో శిక్షణ ఇప్పిస్తున్నాను. 
 • టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేజీ టు పీజీ వరకు విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఉపాధి అవకాశాలు లభించేలా సిలబస్ లో మార్పులు తెస్తాం.
 • టీడీపీ అధికారంలోకి వచ్చాక విదేశీవిద్యను పునరుద్ధరిస్తాం.
 • ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది స్వర్గీయ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ
 • శాసనసభకు తొలి మహిళా స్పీకరును పంపిన ఘనత చంద్రబాబుది. 
 • పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన ఘనత తెలుగుదేశం పార్టీది. మహిళల కోసం 'రాష్ట్ర మహిళా కమిషన్' ను మొదటి సారి ఏర్పాటు చేసింది చంద్రబాబు. 

లోకేశ్ ను కలిసిన ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు

పుట్టపర్తి నియోకవర్గం రామయ్యపేట విడిది కేంద్రంలో ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేశ్  ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని తెలిపారు. 

దీనిపై లోకేశ్ స్పందిస్తూ... జగన్ పాలనలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు. "జగన్ ప్రభుత్వం మిమ్మల్ని అనేక విధాలుగా వేధిస్తోందని తెలుసు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాం. ఉన్నత విద్యావిధానాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తు, రానున్న టెక్నాలజీ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా సిలబస్ ను మారుస్తాం. ఏ విద్యార్థీ డిగ్రీతో తమ చదువులు ఆపకుండా పీజీ చదువుకునేందుకు ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తాం" అని భరోసా ఇచ్చారు.

=====

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 650.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.0 కి.మీ.*

*52వరోజు (27-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం:*

ఉదయం

9.00 – కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రంనుంచి పాదయాత్ర ప్రారంభం.

9.15 – రెడ్డిచెరువుకట్ట వద్ద స్థానికులతో మాటామంతీ.

10.05 – చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో భేటీ.

11.15 – జీనబండ్లపల్లిలో నాయీ బ్రాహ్మణులతో సమావేశం.

మధ్యాహ్నం

12.10 – తిప్పరాజుపల్లి వద్ద భోజన విరామం.

2.00 – తిప్పరాజుపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

2.25 – గోరంట్లలో స్థానికులతో సమావేశం

సాయంత్రం

3.40 – గోరంట్ల ఆర్టీసి సర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

4.30 – గుమ్మయ్యగారిపల్లి వద్ద బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగం.

6.15 – గుమ్మయ్యగారిపల్లి విడిది కేంద్రంలో బస.

********

More Telugu News