డబ్ల్యూపీఎల్ ఫైనల్: ముంబయి ఇండియన్స్ టార్గెట్ 132 రన్స్

  • డబ్ల్యూపీఎల్ ఫైనల్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 రన్స్
  • లక్ష్యఛేదనలో 4 ఓవర్లలో 2 వికెట్లకు 24 రన్స్ చేసిన ముంబయి
Delhi Capitals set 132 runs target to Mumbai Indians in WPL Final

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ పోరులో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. 

ముంబయి బౌలర్లలో ఇస్సీ వాంగ్ 3, హేలీ మాథ్యూస్ 3, మీలీ కెర్ 2 వికెట్లు తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మెగ్ లానింగ్ చేసిన 35 పరుగులే అత్యధికం. ఆఖర్లో రాధా యాదవ్ 12 బంతుల్లో 27, శిఖా పాండే 17 పరుగుల్లో 27 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 

ఇక లక్ష్యఛేదనలో ముంబయి 4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు చేజార్చుకుని 24 పరుగులు చేసింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ 13, యస్తికా భాటియా 4 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో నాట్ షివర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్ 1, జెస్ జొనాస్సెన్ 1 వికెట్ తీశారు.

More Telugu News