థ్యాంక్యూ గాడ్.. సముద్ర ఖని ట్వీట్!

  • సముద్ర ఖని డైరెక్షన్ లో ‘వినోదాయ సిత్తం’ చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్
  • పవన్‌ ‌కు సంబంధించిన టాకీ పోర్షన్ పూర్తి చేశామన్న సముద్రఖని
  • జులై 28న థియేటర్లలో కలుద్దామని ట్వీట్ 
pawan kalyan completes talkie portion of vinodaya sitham remake movie

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీ అయిపోయారు. రానున్న ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇటీవల సముద్ర ఖనితో ‘వినోదాయ సిత్తం’ సినిమా రీమేక్‌ను స్టార్ట్‌ చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు.

తాజాగా పవన్‌కు సంబంధించిన షూటింగ్‌ పార్ట్ పూర్తయినట్లు చిత్ర దర్శకుడు సముద్రఖని వెల్లడించారు. ‘‘థ్యాంక్యూ గాడ్‌.. పవన్‌ కల్యాణ్‌ సర్‌కు సంబంధించిన టాకీ పోర్షన్ ను విజయవంతంగా పూర్తి చేశాం. జులై 28న థియేటర్లలో కలుద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు. పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు. 

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇంత త్వరగా షూటింగ్‌ పూర్తవడంతో పవన్‌ ఫ్యాన్స్‌ కాస్త షాక్.. ఇంకాస్త ఖుషీ అవుతున్నారు. వినోదాయ సిత్తం సినిమాలో పవన్‌ దాదాపు 40 నిమిషాలు కనిపించనున్నట్లు సమాచారం. మానవ రూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపిస్తారు.

ప్రమాదంలో మరణించిన ఓ యువకుడికి దేవుడు పునర్జన్మ ప్రసాదిస్తే అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కథ. యువకుడి పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటించనున్నారు. పేరుకు తమిళ రీమేక్‌ అయినా.. త్రివిక్రమ్‌ తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశారు.

More Telugu News