Mithun Reddy: జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

Who ever opposes Jagan will be defeated says Mithun Reddy
షార్ట్స్‌లో చూడండి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందిస్తూ... పూర్తి ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదని అన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు ఏ గతి పట్టిందో ఇప్పుడు వీరికి కూడా అదే గతి పడుతుందని చెప్పారు. 

చంద్రబాబుకు నైతిక విలువలు లేవని... గతంలో అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్ ను ఎలా దించేశారో అందరికీ తెలుసని అన్నారు. సీటు ఇస్తేనే ఓటు వేస్తామని ఈ ఎమ్మెల్యేలు అడిగారని... మీకు సీటు ఇవ్వలేనని జగన్ నిజాయతీగా చెప్పారని... ఒక ఎమ్మెల్సీ సీటు పోయినా సరే తనకు వ్యక్తిత్వమే ముఖ్యమని జగన్ అనుకున్నారని కొనియాడారు.
Go Back to Shorts
Mithun Reddy
YSRCP
Jagan
Cross Voting

More Telugu News