Farzi: ఓటీటీలో దూసుకుపోతున్న ఫర్జీ.. దేశంలో ఎక్కువ మంది చూసిన సిరీస్ గా రికార్డు!

Shahid Kapoor And Vijay Sethupathis Farzi Is Now The Most Watched Indian Series Of All Time
  • సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిన ఫర్జీ
  • ఇప్పటిదాకా 37 మిలియన్ల వ్యూయర్ షిప్
  • తర్వాతి స్థానాల్లో రుద్ర, పంచాయత్
  • అమెజాన్ ప్రైమ్ లో ఫర్జీ స్ట్రీమింగ్
‘ది ఫ్యామిలీమ్యాన్’ను తెరకెక్కించిన దర్శక ద్వయం రాజ్&డీకే రూపొందించిన మరో సిరీస్ ‘ఫర్జీ’. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఓటీటీలో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది.

ఇండియన్‌ ఓటీటీ వేదికల్లో అత్యధిక మంది వీక్షించిన వెబ్‌ సిరీస్‌గా ఫర్జీ రికార్డు నెలకొల్పింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ఇప్పటివరకు 37 మిలియన్ల మంది వీక్షించారు. దీని తర్వాత స్థానాల్లో అజయ్‌ దేవగణ్ రుద్ర (32.7 మిలియన్లు), పంచాయత్‌ (29.6 మిలియన్లు) వ్యూవర్స్‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ది ఫ్యామిలీమ్యాన్‌ రూపకర్తల నుంచి వస్తున్న వెబ్‌ సిరీస్‌ కావడంతో ముందు నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్‌ కట్‌లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ వెబ్‌సిరీస్‌పై ఎక్కడలేని బజ్ క్రియేట్‌ అయింది. 

ఎలాంటి పెయింటింగ్‌ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడు సన్నీ (షాహిద్‌ కపూర్‌). తన తాత నడుపుతున్న పత్రిక అప్పుల పాలవడంతో దొంగ నోట్లను ముద్రించాలని ప్లాన్‌ చేస్తాడు. మరోవైపు దొంగనోట్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ ఆఫీసర్‌ (విజయ్‌ సేతుపతి) ప్రయత్నాలు చేస్తుంటాడు. దొంగనోట్లను సన్నీ ఎలా ముద్రించాడు. అతడికి ఎదురైన సవాళ్లేంటి అనే నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. సీక్వెల్‌ కూడా ఉండనున్నట్లు మేకర్స్‌ గతంలోనే వెల్లడించారు.
Farzi
Shahid Kapoor
Vijay Sethupathi
Most Watched Indian Series Of All Time
raj DK

More Telugu News