Florida: ఈ చిన్న దీవిని కొనుక్కుంటారా..? రూ.1,800 కోట్లే

This private island in Florida costs Rs 1800 cr has 98 foot pool
  • విస్తీర్ణం 21,000 చదరపు అడుగులు
  • ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్ కంట్రీ దీని చిరునామా
  • ఫ్లోరిడా చరిత్రలో అతిపెద్ద డీల్ గా అవతరణ
ఓ దీవి అమ్మకానికి వచ్చింది. పూర్తి ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యం నిర్వహణలో ఉన్న దీని ధర 218 మిలియన్ డాలర్లు. అంటే రూ.1,800 కోట్లు. ఫ్లోరిడా పామ్ బీచ్ కంట్రీలో ఉంది.  చెప్పిన రేటు రూ.1,800 కోట్లు చెల్లిస్తే ఫ్లోరిడాలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ డీల్ అవుతుంది.

2021లో రియల్ ఎస్టేట్ డెవలపర్ టాడ్ మైకేల్ గ్లాసర్ 85 మిలియన్ డాలర్లు వెచ్చించి దీన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనికి మూడు రెట్లు ధర చెబుతున్నారు. 10 టార్పన్ ఐజిల్ అనే పేరు పెట్టారు. ఇందులో కొత్తగా 9,000 చదరపు అడుగుల పరిధిలో ఇంటిని కూడా నిర్మించారు. ఇంకా గెస్ట్ హౌస్, టెన్నిస్ కోర్ట్, ఇతర క్రీడా సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ దీవి  21,000 చదరపు అడుగుల పరిధిలో విస్తరించింది. 98 అడుగులు స్విమ్మింగ్ పూల్ సైతం ఉంది. 
Florida
sale
Palm Beach county
Rs 1800 crores

More Telugu News