Gold Dust: బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటికి వచ్చింది!

  • ఒడిశాలో ఘటన
  • బొలంగీర్ జిల్లాలో ఓ గ్రామంలో బోరు తవ్వించిన రైతు
  • బురదతో పాటు పైకి వచ్చిన బంగారం రంగు పొడి
  • బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం
  • పొడి నమూనాలు సేకరించిన అధికారులు
  • పరిశీలన నిమిత్తం ల్యాబ్ కు తరలింపు
Gold like dust comes from a bore well in Odisha

ఒడిశాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. నీటి కోసం బోరు తవ్విస్తే అందులోంచి బంగారం రంగులో ఉన్న పొడి బయటికి వచ్చింది. బొలంగీర్ జిల్లా బహాలి గ్రామానికి చెందిన మహ్మద్ జావెద్ తన పొలంలో సాగునీటి కోసం బోరు తవ్వించాడు. అయితే, ఆ బోరు నుంచి బురద నీటితో పాటు బంగారం రంగులో ఉన్న పొడి కూడా పైకి వచ్చింది. చూడ్డానికి అచ్చం అది బంగారంలానే ఉంది.

దాంతో, బోరు వేస్తే బంగారం పడిందన్న వార్త పాకిపోయింది. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు రైతు పొలంలోని బోరు వద్దకు చేరుకుని ఆ పొడి నమూనాలు సేకరించారు. ఆ పొడి బంగారమో కాదో తేల్చేందుకు నమూనాలను ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు, ల్యాబ్ ఫలితాలు వచ్చేవరకు బోర్ ను మూసివేయాలని ఆదేశించారు.

More Telugu News