SED Tickets: ఈ నెల 27న తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

Tirumala SED tickets will be available on March 27
  • ఏప్రిల్ నెల కోటా టికెట్లపై అప్ డేట్
  • ఈ నెల 27 ఉదయం 11 గంటలకు రూ.300 టికెట్ల విడుదల
  • ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలన్న టీటీడీ
ఏప్రిల్ మాసానికి సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో సూచించింది. 

అంతేకాదు, జూన్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టీటీడీ నేడు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. 

ఏప్రిల్ మాసానికి సంబంధించి దివ్యాంగులు, వృద్ధుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను కూడా ఇవాళ విడుదల చేశారు. జూన్ నెలకు సంబంధించి ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ తదితర సేవల టికెట్లను కూడా నేడు అందుబాటులోకి తీసుకువచ్చారు.
SED Tickets
Tirumala
TTD
Andhra Pradesh
Telangana

More Telugu News