Center: కరోనాపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Center alerts states and union territories on corona rising again
  • దేశంలో మళ్లీ వ్యాపిస్తున్న కరోనా
  • గత కొన్నిరోజులుగా నిత్యం 1000కి పైగా కొత్త కేసులు
  • పలు చోట్ల కరోనాతో మరణాలు
  • ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందన్న కేంద్రం
  • ఆందోళనకర పరిస్థితులేవీ లేవని వెల్లడి
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోందని హెచ్చరించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. 

అయితే, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆందోళన కలిగించే పరిస్థితులేమీ లేవని స్పష్టం చేసింది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని వివరించింది. ఇన్ ఫ్లుయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితులను సమీక్షించి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలని సూచించింది. 

ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలని తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచి, కరోనా లక్షణాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని కేంద్రం పేర్కొంది.
Center
Corona Virus
States
Union Territories
India

More Telugu News