ఇది గుండ్రంగా తిరిగే స్టెయిర్ కేస్!
- మిలాన్ లోని సిరో ఫుట్ బాల్ స్టేడియంలో ఉన్న ప్రత్యేక స్టెయిర్ కేస్
- దీన్ని చూడగానే తిరుగుతున్నట్టు అనిపించే భావన
- అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మాణం
స్టెయిర్ కేస్ (మెట్ల మార్గం) వ్యతిరేక దిశలో గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపించినా.. నిజానికి అది ఎటూ తిరగదు. కదలదు కూడా. కాకపోతే స్టెయిర్ కేస్ ను భిన్నమైన డిజైన్ తో, ఆప్టికల్ ఇల్యూజన్ వచ్చేలా నిర్మించారు. ప్రజలు మెట్లు దిగిపోతుండడం వల్ల గుండ్రంగా ఉన్న స్టెయిర్ కేస్ తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు 56 లక్షల మంది ఈ వీడియోని చూశారు. ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ప్రతిభను చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోకుండా ఉండలేరు.