మోదీ ఇంటిపేరుపై గతంలో ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్..  కాంగ్రెస్ శ్రేణుల ప్రశ్నలు

  • కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ ట్వీట్
  • మోదీ అంటేనే అవినీతి అని ట్వీట్
  • ఈ ట్వీట్ కు బీజేపీ ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్
Khusboo old tweet on Modi surfaced again

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడం, తీర్పు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే ప్రజా ప్రతినిధుల చట్టం కింద ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ గతంలో మోదీ ఇంటిపేరుపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మోదీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తుందని 2018 సంవత్సరంలో ఆమె ట్వీట్ చేశారు. అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో ఖుష్బూ చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె చేసిన ట్వీట్ పై బీజేపీ ఏం సమాధానం చెపుతుందని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

More Telugu News