'విరూపాక్ష' నుంచి 'నచ్చావులే' సాంగ్ రిలీజ్!

  • సాయితేజ్ తాజా చిత్రంగా రూపొందిన 'విరూపాక్ష'
  • అటవీ ప్రాంతంలోని గిరిజన గూడెం నేపథ్యంలో నడిచే కథ
  • కథానాయికగా సందడి చేయనున్న సంయుక్త మీనన్  
  • సంగీతాన్ని అందించిన అజనీశ్ లోక్ నాథ్ 
  • ఏప్రిల్ 21వ తేదీన సినిమా విడుదల
Virupaksha lyrical song released

సాయితేజ్ కథానాయకుడిగా రూపొందిన 'విరూపాక్ష' ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయితేజ్ సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే. నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలు చూశాకే' అంటూ ఈ పాట నడుస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు.

ఫారెస్టు ప్రాంతంలోని ఒక గిరిజన గూడెం నేపథ్యంలో, హీరో .. హీరోయిన్ పై ఈ పాటను చిత్రీకరించారు. తాను మనసు పారేసుకున్న హీరోయిన్ ను ఫాలో అవుతూ హీరో పొందే అనుభూతిగా తెరపై ఈ పాట ప్రత్యక్షమవుతుంది .. బీట్ బాగుంది. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News