మనోజ్ విడుదల చేసిన వీడియోపై స్పందించిన మంచు విష్ణు

  • మంచు సోదరుల మధ్య విభేదాలు
  • ఓ వీడియోతో రచ్చకెక్కిన వైనం
  • ఇదేమంత పెద్ద విషయం కాదన్న విష్ణు
  • మనోజ్ తన తమ్ముడని, కోపంలో వీడియో పోస్టు చేసి ఉంటాడని వివరణ
  • తమిద్దరి మధ్య గొడవలు సాధారణ విషయం అని వెల్లడి
Manchu Vishnu reacts to his brother Manchu Manoj video

సీనియర్ నటుడు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. 

ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని స్పష్టం చేశారు. మనోజ్ తన తమ్ముడని, తమిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. సారథి తనతో వాగ్వాదం పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్వాదాన్ని ఆపలేకపోయాడని వివరించారు. మనోజ్ చిన్నవాడు కనుక ఏదో కోపంలో ఆ వీడియోను పోస్టు చేసి ఉంటాడని, దీన్ని పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.

More Telugu News