సోదరుల మధ్య గొడవపై స్పందించిన మంచు లక్ష్మి

  • ప్రస్తుతం తాను బంధువులతో బిజీగా ఉన్నానన్న లక్ష్మి
  • విష్ణు, మనోజ్ మధ్య జరిగిన గొడవ గురించి తనకింకా తెలియదని వ్యాఖ్య 
  • కుటుంబ సభ్యుల మధ్య గొడవగా పరిగణించాలని విజ్ఞప్తి
manchu laxmi responded to the manchu brothers controversy

తన సోదరుల మధ్య జరిగిన గొడవపై మంచు లక్ష్మి స్పందించారు. మంచు విష్ణు, మనోజ్ మధ్య జరిగిన విషయం గురించి తనకింకా తెలియదని, పూర్తి వివరాల్ని తెలుసుకుని మాట్లాడతానని చెప్పారు. విషయం గురించి పూర్తిగా తెలియకుండా వార్తల్ని స్ప్రెడ్ చేయడం సరికాదన్నారు.

ప్రస్తుతం తాను బంధువులతో బిజీగా ఉన్నానని, అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే ఆలోచన చేస్తున్నానని మంచు లక్ష్మి తెలిపారు. ఇంటి సభ్యులు, అన్నదమ్ముల మధ్య జరిగే గొడవగా పరిగణనలోకి తీసుకోవాలని మీడియాకు విన్నవించారు.

మరోవైపు ఈ గొడవ గురించి మనోజ్ సన్నిహితులెవరూ మాట్లాడటానికి ముందుకు రావడంలేదు. లక్ష్మి కూడా మీడియాతో మాట్లాడి.. లీక్ అయిన వీడియోను డిలీట్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్న విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. తన అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతడిపై విష్ణు దాడి చేశాడని, ఇలాగే బంధువుల ఇళ్లల్లో దాడులు చేస్తాడని మనోజ్ ఈ వీడియోలో ఆరోపించారు. ఈ వీడియోను మనోజ్ తన ఫేస్ బుక్ పేజీలో స్టేటస్ గా పెట్టారు. అయితే తన తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీడియోను డిలీట్ చేశారు.

More Telugu News