AP Assembly Session: అసెంబ్లీలో గందరగోళం.. 10 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

  • జీవో నెంబర్ 1 రద్దు చేయాలంటూ టీడీపీ ఆందోళన
  • రెడ్ లైన్ దాటారంటూ సస్పెన్షన్ విధించిన స్పీకర్
  • సస్పెన్షన్ పై టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
10 TDP MLAs suspended from Assembly

ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షాలను అణచివేసేందుకే జీవో నెంబర్ 1ను తీసుకొచ్చారని... దాన్ని రద్దు చేయాలి టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారు స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయారు. పోడియం వద్ద ఇప్పుడు కొత్తగా రెడ్ లైన్ గీశారు. ఈ గీతను దాటితే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయినట్టేనని ఇంతకు ముందు స్పీకర్ హెచ్చరించారు. రెడ్ లైన్ దాటిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ లోకి రావడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అనంతరం 10 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. తమను సభ నుంచి సస్పెండ్ చేయడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News